News13th Oct 10:53 AMSunil Byrisetty1 min read

'సురక్షా యాప్' ప్రారంభించిన సీఎం చంద్రబాబు

నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించేందుకు రూపొందించిన ' ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్'ను చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. నకిలీ మద్యంపై సిట్ బృందంతో మొత్తం ప్రక్షాళన చేస్తామన్నార

'సురక్షా యాప్' ప్రారంభించిన సీఎం చంద్రబాబు
నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించేందుకు రూపొందించిన ' ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్'ను చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. నకిలీ మద్యంపై సిట్ బృందంతో మొత్తం ప్రక్షాళన చేస్తామన్నారు. సిట్లో రాహుల్ దేవ్ శర్మ, కె. చక్రవర్తి, మలికా గార్గ్ సభ్యులుగా ఉంటారని చెప్పారు. "నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించేందుకు 'ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్' ను డిజైన్ చేశాం. స్కాన్ చేస్తే చాలు.. ఆ సీసాకు సంబంధించిన వివరాలన్నీ తెలుస్తాయి. ఎక్కడ అమ్ముతారో అక్కడే జియో ట్యాగింగ్ అవుతుంది. మరోచోట అమ్మేందుకు వీల్లేదు. అలా చేస్తే నేరం కూడా. స్కాన్ చేశాక తయారీ కేంద్రం, తేదీ, బ్యాచ్ అన్నీ వివరాలు తెలుస్తాయి. ప్రస్తుతం గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంది. వినియోగదారులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్, యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా చూస్తాం. నకిలీ మద్యం కేసులో ఎలాంటి రాజీ లేదు.. మొత్తం ప్రక్షాళన చేస్తాం అని చంద్రబాబు స్పష్టం చేశారు.
Andhra Pradesh
Chandrababu Naidu
AP Excise Suraksha App
Fake Liquor Control
Excise Department
Technology for Safety
App Launch
Digital Initiative
Public Safety
యాప్ ప్రారంభం
డిజిటల్ కార్యక్రమం
ప్రజల భద్రత
Scroll for the next article