News23rd Jul 05:05 PMSunil Byrisetty1 min read

మీ భూమి-బ్లాక్ చెయిన్ పైలెట్ ప్రాజెక్టు ప్రారంభం

మీ భూమి-బ్లాక్ చెయిన్ పైలెట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించేలా బ్లాక్‌చెయిన్‌ విధానాన్ని రెవెన్యూ శాఖ రూపొందించిం

మీ భూమి-బ్లాక్ చెయిన్ పైలెట్ ప్రాజెక్టు ప్రారంభం
మీ భూమి-బ్లాక్ చెయిన్ పైలెట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించేలా బ్లాక్‌చెయిన్‌ విధానాన్ని రెవెన్యూ శాఖ రూపొందించింది. ప్రతి ల్యాండ్ పార్సెల్‌కు ప్రత్యేక డిజిటల్ ఐడీ ఇచ్చి టాంపర్-ప్రూఫ్, సెక్యూరిటీతో లావాదేవీలు జరిగేలా బ్లాక్ చెయిన్ వ్యవస్థకు రూపకల్పన చేశారు. డబుల్ రిజిస్ట్రేషన్ సమస్యలను పూర్తిగా నివారించేలా బ్లాక్ చెయిన్ విధానం ఉండనుంది. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ల శాఖలను ఒకే వేదిక మీదకు తెచ్చేలా మీ భూమి-బ్లాక్ చెయిన్ ప్రాజెక్ట్ పని చేస్తుంది. కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పు గోదావరి, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని ఒక్కో మండలంలో ఈ పైలెట్ ప్రాజెక్ట్ అమలు కానుంది. ఈ సందర్భంగా మీ భూమి-బ్లాక్ చెయిన్ అమలు జరిగే తీరును వివరించే వీడియోను అధికారులు ప్రజెంట్ చేశారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Mee Bhoomi
Blockchain
Land Records
Digital Land ID
Revenue Department
భూ సంస్కరణలు
ఆస్తి రిజిస్ట్రేషన్
టాంపర్ ప్రూఫ్ రికార్డులు
ఈ-గవర్నెన్స్
పైలెట్ ప్రాజెక్ట్
Scroll for the next article