News3rd Dec 05:03 PMSunil Byrisetty1 min read

‘రైతన్నా మీ కోసం’ రైతన్నల నుంచి విశేష స్పందన

రైతులు బాగుకోరే ప్రభుత్వం తమదని, లాభసాటి వ్యవసాయం కోసం నిర్వహించిన రైతన్నా మీకోసం కార్యక్రమం విజయవంతమైందని మంత్రి ఎస్.సవిత తెలిపారు. అన్నదాత మేలు కోరే వ్యక్తి సీఎం చంద్రబాబు అని, ర

‘రైతన్నా మీ కోసం’ రైతన్నల నుంచి విశేష స్పందన
రైతులు బాగుకోరే ప్రభుత్వం తమదని, లాభసాటి వ్యవసాయం కోసం నిర్వహించిన రైతన్నా మీకోసం కార్యక్రమం విజయవంతమైందని మంత్రి ఎస్.సవిత తెలిపారు. అన్నదాత మేలు కోరే వ్యక్తి సీఎం చంద్రబాబు అని, రైతుల పేరుతో పార్టీ పెట్టుకుని వారిని అన్నివిధాలా వేధించిన ఘనుడు జగన్ అని మండిపడ్డారు. రైతన్నా మీకోసం ముగింపు కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన వర్క్ షాపులో మంత్రి సవిత పాల్గొని ప్రసంగించారు. రైతులకు ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. వారి బాగుకోరుకునే ప్రభుత్వం తమదన్నారు. వ్యవసాయాన్ని లాభసాటి మార్చలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబునాయుడు రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, వ్యవసాయాధికారులు రైతుల ఇళ్లకు వెళ్లి ఏయే పంటలు వేయాలి... ఏ పంట వేస్తే అధిక దిగుబడులతో పాటు ధరలు లభిస్తాయి... ఏ ఎరువులు వాడాలి...? అనే అంశాలపై వివరించారన్నారు. రైతన్నా మీకోసం కార్యక్రమ నిర్వహణపై అన్నదాతల్లోనూ సంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. అధికారులు సూచనల మేరకు పంట మార్పిడి చేస్తామని రైతులు చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు, పారిశ్రమికాభివృద్ధితో పాటు వ్యవసాయానికి సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నామన్నారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతున్నారన్నారు. వ్యవసాయంలో సాంకేతికతకు పెద్దపీట వేస్తూ పెట్టుబడులు తగ్గేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు.
Andhra Pradesh
Raitanna Mee Kosam
Farmers
Agriculture Development
Minister Savitha
Chandrababu Naidu
AP Government
Farmer Welfare
వ్యవసాయ వర్క్‌షాప్
హార్టీకల్చర్ హబ్
సూపర్ సిక్స్ పథకాలు
పంట మార్పిడి
వ్యవసాయ సాంకేతికత
Scroll for the next article