News11th Oct 05:35 PMSunil Byrisetty1 min read

మరోసారి ఢిల్లీకి సీఎం చంద్రబాబు, లోకేశ్‌

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ మరోసారి ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ నెల 13, 14న ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 14న గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్‌తో డేటా సెంటర్‌

మరోసారి ఢిల్లీకి సీఎం చంద్రబాబు, లోకేశ్‌
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ మరోసారి ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ నెల 13, 14న ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 14న గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్‌తో డేటా సెంటర్‌ ఏర్పాటుపై ఒప్పందం కుదుర్చుకోనున్నారు. రూ.84 వేల కోట్లతో విశాఖలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌, చంద్రబాబు, లోకేశ్‌ సమక్షంలో ఈ ఒప్పందం జరగనుంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని సీఎం చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. 13న ఉదయం రాజధాని అమరావతిలో సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం లోకేశ్‌తో కలిసి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.
Andhra Pradesh CM
Google Data Center
Raiden
Chandrababu Naidu
Nara Lokesh
Delhi visit
Visakhapatnam
Ashwini Vaishnaw
Narendra Modi
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి
సాంకేతిక పెట్టుబడులు
Scroll for the next article