News1st Nov 09:13 AMSunil Byrisetty1 min read

సీఎం చంద్రబాబు బిజీ.. రాత్రికి లండన్!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరింత బిజీ అయ్యారు. నేడు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తలుపుల మండలం పెద్దన్నవారిపల్లిలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార

సీఎం చంద్రబాబు బిజీ.. రాత్రికి లండన్!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరింత బిజీ అయ్యారు. నేడు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తలుపుల మండలం పెద్దన్నవారిపల్లిలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.45 గంటలకు పెద్దన్నవారిపల్లి చేరుకునిమధ్యాహ్నం 01.05 నుంచి 1.30 గంటల వరకూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసి లబ్ధిదారులతో మాట్లాడనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.30 వరకు ప్రజావేదికలో మాట్లాడనున్నారు. తరువాత మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పార్టీ శ్రేణులతో జరిగే సమావేశానికి హాజరు కానున్నారు. అలాగే రాత్రికి సీఎం చంద్రబాబు దంపతులు లండన్ పర్యటనకు వెళ్తున్నారు. ఈనెల 4న లండన్‍లో భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు ప్రదానం కానుంది. వ్యక్తిగత పర్యటన అనంతరం లండన్‍లో పలు కార్యక్రమాల్లో పాల్గొని, పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. నవంబరు 6న లండన్ నుంచి తిరిగి అమరావతి చేరుకుంటారు.
Andhra Pradesh
London Visit
Chandrababu Naidu
CM Tour
Kadiri
Peddannavaripalli
NTR Bharosa
Pension Distribution
Public Meeting
భువనేశ్వరి
ఫెలోషిప్‌ అవార్డు
యుకే పర్యటన
పారిశ్రామిక వేత్తలు
Scroll for the next article