News19th Mar 03:19 PMSunil Byrisetty1 min read
బిల్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ
ఢిల్లీలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంతో గేట్స్ ఫౌండేషన్ సహకారంపై కీలకంగా చర్చించారు. ఆర
ఢిల్లీలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వంతో గేట్స్ ఫౌండేషన్ సహకారంపై కీలకంగా చర్చించారు.
ఆరోగ్య సంరక్షణ విద్య వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాలపైనా మాట్లాడారు.
అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం అన్వేషించామని వివరించారు. స్వర్ణాంధ్ర 2047 దార్శనికత సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాు చెప్పారు.
తమ లక్ష్య సాధనకు ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నామన్నారు.
ఏపీ పురోగతికి బిల్ గేట్స్ తన సమయం మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మైక్రోసాఫ్ట్‌ను రప్పించడంలో అప్పటి సీఎంగా చంద్రబాబు కృషి చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఈ భేటీతో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.