News24th Sep 01:56 PMSunil Byrisetty1 min read
సీఎం చంద్రబాబుతో బీజేపీ చీఫ్ భేటీ
సీఎం చంద్రబాబుని ఉండవల్లి నివాసంలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పీవిఎన్ మాధవ్, స్టేట్ ఆర్గనైజేషనల్ సెక్రటరీ మధుకర్ జీ కలిశారు. భారతీయ జనతాపార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఖాదీ సం
సీఎం చంద్రబాబుని ఉండవల్లి నివాసంలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పీవిఎన్ మాధవ్, స్టేట్ ఆర్గనైజేషనల్ సెక్రటరీ మధుకర్ జీ కలిశారు. భారతీయ జనతాపార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఖాదీ సంత కార్యక్రమం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. ఖాదీ ఉత్పత్తులు ప్రదర్శన, కొనుగోలుకు భారీ ప్రచారం కల్పిస్తూ ప్రత్యేకంగా గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ సంతలు ఏర్పాటు చేస్తున్న వివరాలను ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ ముఖ్యమంత్రికి వివరించారు. విజయవాడలో జరిగే ఖాదీ సంతకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని మాధవ్ ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు.