News22nd Jul 03:37 PMSunil Byrisetty1 min read

ప్రధాని మోదీని కలిసిన సీఎం చంద్రబాబు

పార్లమెంట్ హౌస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. ఆగస్ట్ 1వ తేదీన జరిగే 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం' ప్రారంభోత్సవానికి ఆహ్వానించా

ప్రధాని మోదీని కలిసిన సీఎం చంద్రబాబు
పార్లమెంట్ హౌస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. ఆగస్ట్ 1వ తేదీన జరిగే 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం' ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. అనంతరం కేంద్ర మంత్రి సీ.ఆర్.పాటిల్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. సీఎం చంద్రబాబు వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మ, టీడీపీ, బీజేపీ, జనసేన ఎంపీలున్నారు. పోలవరం ప్రాజెక్టు, జల్‌జీవన్ మిషన్‌పై కేంద్ర మంత్రి సి.ఆర్.పాటిల్‌తో సీఎం చంద్రబాబు చర్చించారు. పోలవరం ప్రాజెక్టు వర్క్ స్టాప్ ఆర్డర్‌ను పూర్తిగా ఎత్తివేసేలా చూడాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రావాలని కేంద్ర మంత్రి సీ.ఆర్.పాటిల్‌ను ఆహ్వానించారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో పోలవరం ముంపు ప్రాsతాల సమస్యను పరిష్కరించాలని కేంద్ర మంత్రి సీ.ఆర్.పాటిల్‌కు సీఎం చంద్రబాబు వినతి అందజేశారు.
Andhra Pradesh
Delhi
N Chandrababu Naidu
Narendra Modi
Prime Minister Modi
Parliament House
Alluri Sitarama Raju International Airport
సీఆర్ పాటిల్
రామ్మోహన్ నాయుడు
శ్రీనివాస వర్మ
టీడీపీ
బీజేపీ
జనసేన
Scroll for the next article