News8th Oct 11:35 AMSunil Byrisetty1 min read
కేంద్ర మంత్రి పాటిల్ తో చంద్రబాబు భేటీ
పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని, ఇటీవల రూ.30 వేల కోట్లతో చేపట్టిన జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార పనుల వివరాలను కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ
పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని, ఇటీవల రూ.30 వేల కోట్లతో చేపట్టిన జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార పనుల వివరాలను కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. ఈ రెండు ప్రాజెక్టులకు నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని కోరారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు సీఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేసేలా పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో సుదీర్ఘంగా పెండింగులో ఉన్న పలు అంశాలను పరిష్కారించాలని సీఎం కోరారు. కేంద్ర జల మంత్రిత్వ శాఖ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. మూడు రాష్ట్రాల విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సమస్యను పరిష్కరించుకోవచ్చని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టు వద్ద 41.15 మీటర్ల కాంటూరు వరకు నీటిని నిలిపేందుకు అవసరమైన పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులను త్వరితగతిన చేపడుతున్నట్టు కేంద్ర మంత్రికి తెలిపారు. పోలవరానికి నిధుల కొరత రాకుండా చూడాలని కోరారు.