News22nd Aug 11:46 AMSunil Byrisetty1 min read
వెలిగొండ నిర్వాసితులతో సీఎం
వెలిగొండ నిర్వాసితులకు రూ.250 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించారు. ఈ నెల 31 తేదీన వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభిస్తామన్నారు.అసాధ్యమనుకున్న 30 ఏళ్ల వెలిగొండ
వెలిగొండ నిర్వాసితులకు రూ.250 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించారు. ఈ నెల 31 తేదీన వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభిస్తామన్నారు.అసాధ్యమనుకున్న 30 ఏళ్ల వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని సుసాధ్యమని చేసి చూపించామన్నారు. 1996లో శిలాఫలకం వేసి 2026లో ప్రాజెక్టును ప్రాజెక్టును ప్రారంభించుకుంటున్నామని చెప్పారు. సీఎంగా 1995లో ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడు రైతులు సాగు, తాగునీరు ఇవ్వాలని కోరారని గుర్తు చేశారు. అందుకే ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఇప్పుడు ప్రారంభించేలా రెండేళ్లలో రూ.2,250 కోట్లు ఖర్చు చేశామన్నారు. నాడు ఎన్టీఆర్ వేసిన వివిధ ప్రాజెక్టుల ఫౌండేషన్లను పూర్తి చేసి ప్రారంభించటం తన అదృష్టమన్నారు. ఈ ఏడాది ఎల్ నినో కారణంగా 50 శాతం లోటు వర్షపాతం ఉంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ లకు నీళ్లు రాలేదని, అప్రమత్తంగా ఉండాలని కోరారు.