News28th Jul 11:46 AMSunil Byrisetty1 min read
త్వరలో సింగపూర్‌కు ప్రధాని మోదీ
గత అయిదేళ్ల విధ్వంస పాలన చూశాక రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు విదేశాల్లో ఉన్న తెలుగువారంతా స్వచ్చందంగా ముందుకు వచ్చారని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. అం
గత అయిదేళ్ల విధ్వంస పాలన చూశాక రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు విదేశాల్లో ఉన్న తెలుగువారంతా స్వచ్చందంగా ముందుకు వచ్చారని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. అందుకే ఏ దేశం వెళ్లినా ముఖ్యమంత్రి, తాను తొలుత తెలుగువాళ్లను కలవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. తెలుగు డయాస్పోరా సమావేశాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లతో లోకేష్ సమావేశం అయ్యారు. సింగపూర్ అభివృద్ధి చెందిన తీరును మనమంతా స్పూర్తిగా తీసుకోవాలన్నారు. ఇక్కడ ఉన్న తెలుగు వారంతా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు కావడం వల్ల రాష్ట్రం ఊపిరి తీసుకుంటోందని చెప్పారు. ప్రధాని మోదీ త్వరలోనే సింగపూర్ లో పర్యటిస్తారని, ఆ పర్యటనలో పెద్ద ఎత్తున తెలుగువారు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.