News23rd Nov 02:57 PMSunil Byrisetty1 min read

గుంతల రహిత రహదారులే లక్ష్యం

రాష్ట్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రంలోని అన్ని రహదారులను గుంతల రహితంగా

గుంతల రహిత రహదారులే లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రంలోని అన్ని రహదారులను గుంతల రహితంగా మార్చాలని అధికారులను ఆదేశించారు. ఆర్ అండ్ బీ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి, మరమ్మతుల పనుల తీరును క్షేత్రస్థాయిలో స్వయంగా తనిఖీ చేయాలని మంత్రి జనార్థన్ రెడ్డి, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కృష్ణబాబులను ఆదేశించారు. ఇప్పటికీ పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని, అత్యుత్తమ ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రహదారుల నిర్మాణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, వినూత్నమైన మెటీరియల్‌ను వినియోగించే పద్ధతులను అందిపుచ్చుకోవాలని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
Andhra Pradesh Government
Chandrababu Naidu
Road Development
Pothole-Free Roads
R&B Department
Infrastructure
Road Maintenance
రహదారి మరమ్మతులు
ఆధునిక నిర్మాణ సాంకేతికత
సురక్షిత ప్రయాణం
Scroll for the next article