News29th Dec 05:07 PMSunil Byrisetty1 min read

రాష్ట్రాన్ని క్రీడాంధ్ర‌ప్ర‌దేశ్ గా తీర్చిదిద్ద‌ట‌మే సీఎం చంద్ర‌బాబు ల‌క్ష్యం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను క్రీడాంధ్ర‌ప్ర‌దేశ్ గా తీర్చిదిద్దేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కృషి చేస్తున్నార‌ని, ఆ కార్య‌క్ర‌మంలో క్రీడాకారులు కూడా భాగ‌స్వామ్యం కావాల‌ని ఎంపీ కేశినేన

రాష్ట్రాన్ని క్రీడాంధ్ర‌ప్ర‌దేశ్ గా తీర్చిదిద్ద‌ట‌మే సీఎం చంద్ర‌బాబు ల‌క్ష్యం
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను క్రీడాంధ్ర‌ప్ర‌దేశ్ గా తీర్చిదిద్దేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కృషి చేస్తున్నార‌ని, ఆ కార్య‌క్ర‌మంలో క్రీడాకారులు కూడా భాగ‌స్వామ్యం కావాల‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ పిలుపునిచ్చారు. విజయవాడ గ‌వ‌ర్న‌మెంట్ పాలిటెక్నిక్ కాలేజీల్ లో డిసెంబ‌ర్ 29 నుంచి డిసెంబ‌ర్ 30 వ‌ర‌కు జ‌రిగే ఉమ్మ‌డి కృష్ణా జిల్లాల‌ ఇంట‌ర్ పాలిటెక్నిక్ స్పోర్ట్ రీజ‌న‌ల్ స్పోర్ట్స్ మీట్ 2025-26 ను ముఖ్యఅతిథులుగా హాజ‌రైన ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ క్రీడాజ్యోతి వెలిగించి ఈ పోటీల‌ను ప్రారంభించారు. అనంత‌రం శాంతి క‌పోతాల‌ను గాల్లోకి ఎగ‌ర‌వేశారు. ఎంపీ శివ‌నాథ్ మాట్లాడుతూ ఉమ్మ‌డి కృష్ణా జిల్లాల‌ ఇంట‌ర్ పాలిటెక్నిక్ స్పోర్ట్ రీజ‌న‌ల్ స్పోర్ట్స్ మీట్ లో పాల్గొన్న క్రీడాకారుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. సీఎం చంద్ర‌బాబు విద్యార్ధులు ఎడ్యుకేష‌న్ తో పాటు క్రీడాల్లో కూడా రాణించే విధంగా చ‌ర్య‌లు తీసుకున్నార‌న్నారు. విజ‌య‌వాడకు చెందిన క్రీడాకారులు క్రీడ‌ల్లో బాగా రాణిస్తున్నార‌ని కొనియాడారు. విజయవాడలో జ‌రిగిన జాతీయస్థాయి సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో న‌గ‌రానికి చెందిన సూర్య చరిష్మా విజ‌యం సాధించి యువ క్రీడాకారుల‌కు స్పూర్తి అందించింద‌న్నారు.
Andhra Pradesh
Sports Andhra Pradesh
CM Chandrababu Naidu
AP Sports Development
Keshineni Sivanath
Gadde Ramamohan
Inter Polytechnic Sports Meet
ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్
విద్యార్థి క్రీడాకారులు
క్రీడా ప్రోత్సాహం
బ్యాడ్మింటన్
Scroll for the next article