News16th Oct 06:18 PMSunil Byrisetty1 min read
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాల సమర్పించిన సీఎం దంపతులు
ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న కనకదుర్గ అమ్మ వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు పట్టువస్త్రాల సమర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ దసరా నవరాత్రులు శుభాకాంక
ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న కనకదుర్గ అమ్మ వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు పట్టువస్త్రాల సమర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ దసరా నవరాత్రులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి కుటుంబ సమేతంగా చీర, సారె సమర్పించాను, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నానని తెలిపారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయ బోర్డ్, అధికారులు సమర్ధవంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. 6 రోజుల్లో 8 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని చెప్పారు. చిన్నారుల నుంచి పెద్దలు వరకూ అందరూ భక్తితో వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసకుంటున్నారన్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధించానని సీఎం పేర్కొన్నారు.