News19th Jan 12:59 PMSunil Byrisetty1 min read

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు చేరుకున్న సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు స్విట్జర్లాండ్‌ చేరుకున్నారు. దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. స్విట్జర్లాండ్ &

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు చేరుకున్న సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు స్విట్జర్లాండ్‌ చేరుకున్నారు. దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. స్విట్జర్లాండ్ & లీచ్టెన్‌స్టెయిన్ భారత రాయబారి అంబర్ కుమార్ వారికి సాదర స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్‌ను పరిశ్రమలు, సాంకేతికత ఆవిష్కరణలకు గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఈ పర్యటన సాగిస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడం ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా "ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశ్రమలు మరియు సాంకేతిక రంగాలలో అద్భుతమైన వృద్ధిని కనబరుస్తోంది. ప్రపంచ స్థాయి పెట్టుబడులకు, భాగస్వామ్యాలకు ఏపీ అత్యంత అనుకూలమైన వేదిక." అని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా పేర్కొంది.
Andhra Pradesh
World Economic Forum
Davos
CM Chandrababu Naidu
Andhra Pradesh
Switzerland Visit
Zurich Airport
Indian Ambassador Amber Kumar
పరిశ్రమల అభివృద్ధి
సాంకేతిక ఆవిష్కరణలు
విదేశీ పెట్టుబడులు
Scroll for the next article