News30th Dec 11:32 AMSunil Byrisetty1 min read

రాయచోటి అభివృద్ధికి సీఎం చంద్రబాబు హామీ

జిల్లాల పునర్విభజన అంశాలలో భాగంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి సీఎం చంద్రబాబు నాయుడు భరోసా నిచ్చారు. ఈ నేపథ్యంలో సీఎంఓ నుంచి ఫోన్ కాల్ రావడంతో, మంత్రి మండిపల్లి రాంప్రసాద్

రాయచోటి అభివృద్ధికి సీఎం చంద్రబాబు హామీ
జిల్లాల పునర్విభజన అంశాలలో భాగంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి సీఎం చంద్రబాబు నాయుడు భరోసా నిచ్చారు. ఈ నేపథ్యంలో సీఎంఓ నుంచి ఫోన్ కాల్ రావడంతో, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. ఈ భేటీలో రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్, సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఉన్నారు. రాయచోటి అగ్రగామిగా నిలిచేలా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. రాయచోటిపై తనకున్న అనుబంధం, మమకారం గురించి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. గతంలో రూపొందించిన ప్రణాళికల ప్రకారమే రాయచోటిని ప్రణాళిక బద్దమైన అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాయచోటిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి మండిపల్లికి స్పష్టం చేశారు. రాయచోటి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మరింత కృషి చేస్తానని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Chief Minister
Rayachoti
District Reorganisation
Mandipalli Ramprasad Reddy
అచ్చెన్నాయుడు
అభివృద్ధి హామీ
మెడికల్ కాలేజీ
ప్రణాళికాబద్ధ అభివృద్ధి
Scroll for the next article