News15th Jul 11:31 AMSunil Byrisetty1 min read
ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు 2 రోజుల పర్యటన
ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు 2 రోజులపాటు పర్యటిస్తున్నారు. 15వ తేదీ గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అవుతార
ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు 2 రోజులపాటు పర్యటిస్తున్నారు. 15వ తేదీ గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 2.30 గంటలకు 1-జన్‌పథ్‌లో నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే సరస్వత్‌తో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ మెట్రో ఎండీ భేటీ అవుతారు. ముఖ్యమంత్రి నివాసం 1-జన్‌పథ్‌లో జరిగే ఈ సమావేశంలో రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన మెట్రో రైలు ప్రాజెక్టులపై చర్చిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు మూర్తి మార్గ్-3లో పీవీ నర్సింహారావు సంస్మరణ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. రాత్రి 7 గంటలకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం అవుతారు. 16వ తేదీ ఉదయం 10 గంటలకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్షుక్ ఎల్ మాండవీయ భేటీ అవుతారు. అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు జలశక్తి భవన్‌లో కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశం అవుతారు. సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్నారు. 16వ తేదీ రాత్రి ఢిల్లీలోనే బస చేసి 17 వ తేదీ గురువారం ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారు.