News18th Jan 11:31 AMSunil Byrisetty1 min read

ప్రాధాన్యతల వారీగా ప్రాజెక్టుల నిర్మాణం

రాష్ట్రంలోని వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రాధాన్యతల వారీగా చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గత ఏడాది హంద్రీ-నీవా కాల్వ వెడల్పు పనులకు గడువు నిర

ప్రాధాన్యతల వారీగా ప్రాజెక్టుల నిర్మాణం
రాష్ట్రంలోని వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రాధాన్యతల వారీగా చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గత ఏడాది హంద్రీ-నీవా కాల్వ వెడల్పు పనులకు గడువు నిర్దేశించుకుని పూర్తి చేశామని.. అలాగే పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించామని గుర్తు చేశారు. అదే తరహాలో 2026 ఏడాదిలో వెలిగొండ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల నిర్మాణ పనులను పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన కీలక ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. రాయలసీమలో ఉద్యాన రంగంలోని అభివృద్ధి కార్యక్రమాలు, పూర్వోదయ పథకం, నల్లమల సాగర్ సహా ఇరిగేషన్ ప్రాజెక్టులు, వివిధ శాఖల్లో చేపట్టాల్సిన పీపీపీ ప్రాజెక్టులు, జల్ జీవన్ మిషన్ పథకం, సాస్కీ నిధుల వినియోగం వంటి అంశాలపై చర్చించారు. దావోస్ పర్యటనకు వెళ్లే ముందు ఆయా పథకాలు, ప్రాజెక్టులపై సమీక్షించిన సీఎం.. దావోస్ పర్యటన నుంచి తిరిగి రాగానే తనకు సమగ్ర నివేదికలు సమర్పించాలని మంత్రులకు, ఉన్నతాధికారులకు ఆదేశించారు. ”గత ఏడాది వివిధ రంగాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం... అలాగే సంక్షేమాన్ని అమలు చేశాం. 2026లో కీలక ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉంది. ముఖ్యంగా పూర్వోదయ స్కీం ద్వారా ప్రకాశం సహా రాయలసీమలోని తొమ్మిది జిల్లాల్లో అభివృద్ధి చేయొచ్చు. దీనికి అదనంగా మరిన్ని ప్రాజెక్టులను సిద్దం చేయాలి.”అని సీఎం ఆదేశించారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Irrigation Projects
Polavaram Project
Handri Neeva
Veligonda Project
Uttarandhra Projects
Rayalaseema Development
జల్ జీవన్ మిషన్
మౌలిక వసతుల అభివృద్ధి
పీపీపీ ప్రాజెక్టులు
ప్రభుత్వ సమీక్ష
Scroll for the next article