News31st Jan 03:26 PMSunil Byrisetty1 min read
కుప్పంలో 5555 సూపర్ ఇ-సైకిళ్లను అందించిన సీఎం
పేదలకు సేవలో కార్యక్రమంలో భాగంగా ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. కుప్పంలో 5555 సూపర్ ఇ-సైకిళ్లను మహిళలకు అందచేశామన్నారు. గతంలో ఒకేసారి పెద్దమొత్తంలో సైకిళ్లను డ
పేదలకు సేవలో కార్యక్రమంలో భాగంగా ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. కుప్పంలో 5555 సూపర్ ఇ-సైకిళ్లను మహిళలకు అందచేశామన్నారు. గతంలో ఒకేసారి పెద్దమొత్తంలో సైకిళ్లను డెలివరీ చేసిన రికార్డును తుడిచి పెట్టి కుప్పంలో చరిత్ర సృష్టించామన్నారు. ఇ-సైకిళ్ల వల్ల రాబోయే కాలంలో ఎంతో ఉపయోగం ఉంటుందని, ఇ-సైకిళ్లకు సూపర్ సైకిల్ అనే పేరు పెట్టామని తెలిపారు.60 కిలో మీటర్ల వరకు ఈజీగా సైకిల్ మీద వెళ్లి పని చేసుకోవచ్చన్నారు. మొన్నటి ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేశారని, ఇప్పుడు ఆ సైకిల్ ద్వారా మీ ఆరోగ్యం బాగుండేలా చూస్తున్నామని, కాలుష్యం తగ్గించేలా కృషి చేస్తున్నామని వివరించారు.