News21st Mar 10:02 AMSunil Byrisetty1 min read
తిరుమల శ్రీవారి సన్నిధిలో సీఎం చంద్రబాబు కుటుంబం
నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తాత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సుల కోసం గురువారం రాత్రి తిరుమల చేరుకున్నారు. ఆయనతో పాటు సతీమణి నారా భువనేశ్వరి, కు
నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తాత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సుల కోసం గురువారం రాత్రి తిరుమల చేరుకున్నారు.
ఆయనతో పాటు సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు మంత్రి నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ కూడా ఉన్నారు.
పద్మావతి విశ్రాంతి గృహం దగ్గర టీటీ డీ చైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి రామానారాయణ రెడ్డి, టీటీడీ ఈవో శ్యామల రావు తదితరులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.
రాత్రి అక్కడే బస చేసిన సీఎం కుటుంబం, శుక్రవారం ఉదయం స్వామివారి దర్శనం చేసుకున్నారు.
ఉదయం 7:45 గంటలకు పద్మావతి విశ్రాంతి గృహం నుంచి బయలుదేరి వైకుంఠం-1 క్యూ కాంప్లెక్స్ నుంచి దర్శనానికి వెళ్లారు.
ఉదయం 8 నుంచి 8:50 గంటల వరకు శ్రీవారి ఆలయంలో దర్శనం చేసుకుని దేవాన్ష్ పేరిట ప్రత్యేక పూజలు చేయించారు.
అయితే ఆలయ సంప్రదాయాలను గౌరవిస్తూ, మహాద్వారం ద్వారా కాకుండా క్యూ కాంప్లెక్స్ నుంచే ప్రవేశించారు.
దర్శనం తర్వాత మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనానికి చేరుకుని, స్వయంగా అన్నదానంలో పాల్గొనడంతోపాటు, అన్నప్రసాదానికి దేవాన్ష్ పేరుతో విరాళం అందజేశారు.