News5th Oct 04:11 PMSunil Byrisetty1 min read

తిరుమల తరహాలో శ్రీశైలం దేవస్థానం

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఉన్నతాధికా

తిరుమల తరహాలో శ్రీశైలం దేవస్థానం
నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిగిన దివ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ఆలయ సమగ్రాభివృద్దిపై చర్చ జరిపారు. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై చర్చించారు. తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణకు ముఖ్యమంత్రి ఆదేశమిచ్చారు. దేవాలయ అభివృద్ధి కోసం 2 వేల హెక్టార్ల భూమిని దేవాదాయశాఖకు కేటాయించేలా కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైల క్షేత్రానికి జాతీయ రహదారులను అనుసంధానించేలా ప్రణాళికలు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
Srisailam Temple
Temple Development
Chandrababu Naidu
Pawan Kalyan
Andhra Pradesh Government
Jyotirlinga
Shakti Peetha
Pilgrimage Development
Tourism Infrastructure
Temple Expansion
తిరుమల తరహాలో శ్రీశైలం దేవస్థానం
Scroll for the next article