News14th Jan 03:13 PMSunil Byrisetty1 min read

న‌గ‌రాభివృద్ధి పై సీఎం చంద్ర‌బాబు ప్ర‌త్యేక దృష్టి

గత ప్రభుత్వంలో విజయవాడ నగర అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ అన్ని విధాలా అభివృద్ధి చేయ‌టం జ‌రుగుతోంది.. ముఖ్యంగా ముఖ్య‌మ

న‌గ‌రాభివృద్ధి పై సీఎం చంద్ర‌బాబు ప్ర‌త్యేక దృష్టి
గత ప్రభుత్వంలో విజయవాడ నగర అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ అన్ని విధాలా అభివృద్ధి చేయ‌టం జ‌రుగుతోంది.. ముఖ్యంగా ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టితో నగరాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అన్నారు. గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం, ఎన్టీఆర్ భ‌వ‌న్ లో బుధ‌వారం ఎంపి కేశినేని శివ‌నాథ్ ఆధ్వ‌ర్యంలో సంక్రాంతి సంబ‌రాలు ఘ‌నంగా జ‌రిగాయి. భోగి వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, మహిళా నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సంక్రాంతి శోభతో ఎంపీ కార్యాలయం కళకళలాడగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంపీ కేశినేని శివనాథ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆధ్వర్యంలో భోగి మంటలు వెలిగించి, స‌తీమ‌ణి కేశినేని జానకీ ల‌క్ష్మీ, కుమారుడు వెంక‌ట్, కుమార్తె స్నిగ్ధ, ఎన్డీయే కూటమి నాయకులు, పార్టీ శ్రేణులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. భోగి వేడుక‌ల ప్రారంభానికి ముందు ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా హాజ‌రైన ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షురాలు గ‌ద్దె అనురాధ తో కలిసి టిడిపి వ్య‌వ‌స్థాపక అధ్యక్షుడు, దివంగ‌త నేత మాజీ ముఖ్య‌మంత్రి నందమూరి తార‌క‌రామారావు విగ్రహానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన విధానాలను ఇప్పుడు అదే పార్టీ నేతలే భోగి మంటల్లో వేసి కాలుస్తున్నారని ఎద్దేవా చేశారు.. మెడికల్ కళాశాలలకు సంబంధించిన జీవోలు కూడా వైసీపీ ప్రభుత్వమే తీసుకువచ్చిందని గుర్తు చేశారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Urban Development
Vijayawada Development
Kesineni Sivanath
Vijayawada MP
TDP
NDA Alliance
ఎన్డీయే కూటమి
ఎన్టీఆర్ జిల్లా
సంక్రాంతి సంబరాలు
భోగి వేడుకలు
Scroll for the next article