Politics7th Jun 03:52 PMSunil Byrisetty1 min read
వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు!
ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారనే సమాచారం తన దగ్గర ఉందన్నారు. ప్రజలు మనలను గమనిస్తున్నారనే విషయం
ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారనే సమాచారం తన దగ్గర ఉందన్నారు. ప్రజలు మనలను గమనిస్తున్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. ఎవరైనా వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా 12న అమరావతిలో కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఏడాదిలో చేసిన కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. 2024 జూన్‌కు ముందు ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉందన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాం.. ఏపీలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగిస్తున్నామని వివరించారు. వచ్చే నెల నాటికి పార్టీలోని అన్ని కమిటీల నియామకం పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.