News23rd Jan 05:26 PMSunil Byrisetty1 min read

గోదావరి పుష్కరాలపై సీఎం చంద్రబాబు అత్యున్నత సమీక్ష

గోదావరి పుష్కర పనులపై తొలిసారి సీఎం చంద్రబాబు అత్యున్నత సమీక్ష నిర్వహించారు. 2027 జూన్ 26 నుంచి 2027 జూలై 7 వరకు 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు నిర్వహించాలని నిర్ణయించారు. గోదావరి

గోదావరి పుష్కరాలపై సీఎం చంద్రబాబు అత్యున్నత సమీక్ష
గోదావరి పుష్కర పనులపై తొలిసారి సీఎం చంద్రబాబు అత్యున్నత సమీక్ష నిర్వహించారు. 2027 జూన్ 26 నుంచి 2027 జూలై 7 వరకు 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు నిర్వహించాలని నిర్ణయించారు. గోదావరి ప్రవహించే పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ ఆరు జిల్లాలో పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. గోదావరి పుష్కరాలపై సమీక్షకు ముందుగా ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనం అందించారు. తన హయాంలో 3వ సారి గోదావరి పుష్కరాలు నిర్వహించడం తన అదృష్టమని సీఎం చెప్పారు. ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లతో పాటు... కొత్తగా 139 ఘాట్లతో పాటు మొత్తం 373 ఘాట్లు 9,918 మీటర్ల పొడవున అభివృద్ధి చేసేలా ప్రణాళికలకు రూపకల్పన చేశారు. దేశ, విదేశాల నుంచి సుమారు 10 కోట్ల మంది భక్తులు గోదావరి పుష్కర స్నానం ఆచరించేందుకు రాష్ట్రానికి వస్తారని అంచనాలున్నాయన్నారు. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా చూడాలని సీఎం సూచించారు.
Andhra Pradesh government
Godavari Pushkaralu
CM Chandrababu Naidu
High-Level Review
Pushkaralu 2027
Polavaram
East Godavari
West Godavari
కోనసీమ
కాకినాడ
పుష్కర ఘాట్లు
భక్తుల ఏర్పాట్లు
Scroll for the next article