News30th Jan 03:43 PMSunil Byrisetty1 min read

గుంటూరులో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం

గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రభుత్వంలో, పాలనలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటానని, కానీ ఈ రోజు వచ్చిన ఈ కార్యక్రమం

గుంటూరులో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం
గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రభుత్వంలో, పాలనలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటానని, కానీ ఈ రోజు వచ్చిన ఈ కార్యక్రమం స్పూర్తిని ఇచ్చిందని పేర్కొన్నారు. ఇంకా సమాజంలో మంచి మిగిలి ఉంది అనడానికి మీరంతా ఉదాహరణ అని ప్రశంసించారు. 40, 50 ఏళ్ల క్రితమే విదేశాలకు వెళ్లినా.. కొందరు జన్మభూమిని మర్చిపోతారని, చదువుకున్న కాలేజీని గుర్తు పెట్టుకుని 1981లోనే జింకానా ఏర్పాటు చేసుకుని ఇంత పెద్ద సాయం చేసిన వారందరికీ అభినందనలు తెలుపుతున్నానన్నారు. నిర్మాణం కోసం మీరు రూ.100 కోట్లు ఖర్చు చేయడమే కాకుండా.. దాన్ని మెయింటైన్ చేయడం కోసం కొంత డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేయడం గొప్ప విషయమని సీఎం కొనియాడారు.
Andhra Pradesh
Guntur
Mother and Child Care Center
CM Chandrababu Naidu
Healthcare Development
సామాజిక కార్యక్రమాలు
జీజీహెచ్
కమ్యూనిటీ సర్వీస్
ఆరోగ్య మౌలిక సదుపాయాలు
ప్రభుత్వ పథకాలు
Scroll for the next article