News24th Apr 04:09 PMSunil Byrisetty1 min read
పాలనలో ఏఐ.. త్వరలో భారీ డేటా లేక్!
పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తూనే, ప్రజలకు సేవల విషయంలో మానవీయకోణం చూపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏఐ ఆధారిత స్మార్ట్ వ్యవస్థ ఏర్పాటుతో రియల
పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తూనే, ప్రజలకు సేవల విషయంలో మానవీయకోణం చూపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
ఏఐ ఆధారిత స్మార్ట్ వ్యవస్థ ఏర్పాటుతో రియల్ టైమ్‌లో సేవలు అందించవచ్చని చెప్పారు.
ఇందుకోసం పాత విధానాల స్థానంలో నూతన సాంకేతికతను ప్రవేశ పెట్టాల్సి ఉందన్నారు. టెక్నాలజీ అనేది ప్రజల కోసం ఉపయోగపడాలని ఆకాంక్షించారు.
రాష్ట్రంలో భారీ డేటా లేక్‌ను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి అన్నారు.
‘ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్సఫర్మేషన్’ అంశంపై గురువారం సచివాలయంలో ఉన్నతాధికారులతో జరిగిన వర్క్‌షాప్‌ను ప్రారంభించి, ముఖ్యమంత్రి ప్రసంగించారు.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగంపైన ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు.