News16th Sep 06:30 PMSunil Byrisetty1 min read

ప్రభుత్వ సేవలకు రేటింగ్స్

వివిధ ప్రభుత్వ శాఖలు అందించే సేవలకు ఇకపై రేటింగ్స్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. క్వాంటం వ్యాలీ, వాట్సప్ గవర్నెన్స్, డేటా లేక్, ఆర్టీజీఎస్ లెన్స్, అవేర్ 2.0

ప్రభుత్వ సేవలకు రేటింగ్స్
వివిధ ప్రభుత్వ శాఖలు అందించే సేవలకు ఇకపై రేటింగ్స్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. క్వాంటం వ్యాలీ, వాట్సప్ గవర్నెన్స్, డేటా లేక్, ఆర్టీజీఎస్ లెన్స్, అవేర్ 2.0 అంశాలపై సీఎం సమీక్షించారు. పాలనలో టెక్నాలజీ వినియోగంపై జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ''కొన్ని ప్రభుత్వ శాఖల పనితీరు మరింతగా మెరుగు పడాల్సి అవసరం ఉంది. గతంతో పోల్చుకుంటే కొన్ని శాఖల పనితీరు మెరుగు అయినా... రెవెన్యూ లాంటి శాఖల పనితీరు మరింత బాగుపడాల్సి ఉంది. ఎన్ని సార్లు చెబుతున్నా రెవెన్యూ శాఖ ప్రజలకు సంతృప్త స్థాయిలో సేవలు అందించటం లేదు. ఈ పరిస్థితుల్లో అన్ని ప్రభుత్వ సేవల్ని రేటింగ్ చేయాలని నిర్ణయించాం. కలెక్టర్లు చూసే దస్త్రాల క్వాలిటీ ఎంత ఉందో కూడా తనిఖీ చేస్తాం. సీనియర్ అధికారులు కూడా తమ పని విధానం మార్చుకోవాలి. ఇకపై తమ తమ శాఖలకు సంబంధించిన క్షేత్ర స్థాయి సమాచారం కోసం పదే పదే కలెక్టర్లను నివేదికలు అడిగే పరిస్థితి రాకూడదు. ఆర్టీజీఎస్ నుంచి అవసరమైన మేరకు నివేదికలు తీసుకోవాలి. దానికి అనుగుణంగా క్షేత్ర స్థాయిలో పని చేయించాలి. ఉన్నతాధికారులు కలెక్టర్లను రిపోర్టులు కోరుతూ ఉండడం వల్ల పనులు ముందుకు కదలడం లేదనే విమర్శలు వస్తున్నాయని... ఇకపై ఇలాంటి వాటికి చెక్ పెట్టాలి. ఆ కాలం ముగిసింది.” అని చంద్రబాబు స్పష్టం చేశారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Government Services
Public Service Ratings
Revenue Department
District Collectors
Quantum Valley
WhatsApp Governance
ప్రభుత్వ సేవలకు రేటింగ్స్
ఈ-గవర్నెన్స్
పాలనలో టెక్నాలజీ
Scroll for the next article