News12th Oct 05:22 PMSunil Byrisetty1 min read

తిరుపతి సమగ్రాభివృద్ధికి శ్రీకారం

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన తిరుమల–తిరుపతి ప్రాంతాన్ని మరింత అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా, ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేలా చేపట్టిన పనులకు ము

తిరుపతి సమగ్రాభివృద్ధికి శ్రీకారం
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన తిరుమల–తిరుపతి ప్రాంతాన్ని మరింత అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా, ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేలా చేపట్టిన పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, టీటీడీ పరిధిలో రూ.3,222 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యాలను కల్పించేందుకు రూ.2,750 కోట్లతో సమీకృత టౌన్‌షిప్‌ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సురక్షితమైన, ఆధ్యాత్మిక అనుభూతిని అందించేలా తిరుపతిలోని అలిపిరి సమీపంలో ఎస్వీ జూపార్కు రహదారి వద్ద సమీకృత యాత్రికుల టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేస్తున్నారు. మొత్తం రూ.2,750 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో వసతి, అన్నప్రసాదం, విశ్రాంతి, రవాణా, పార్కింగ్‌, వైద్య సేవలు, డిజిటల్‌ సమాచార కేంద్రాలు సహా భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఒకేచోట అందుబాటులోకి తీసుకురానున్నారు. భక్తుల వసతి కోసం రూ.1,332 కోట్లతో నాలుగు బ్లాకుల్లో పది అంతస్తుల చొప్పున మొత్తం 2,700 గదులను నిర్మించనున్నారు. వీటి ద్వారా రోజుకు సుమారు 15 వేల మంది భక్తులకు వసతి కల్పించే అవకాశం ఉంది.
Scroll for the next article