News11th Nov 05:15 PMSunil Byrisetty1 min read
శ్రీశైలంలో 3 స్టార్ హోటల్ కు భూమి పూజ
నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీ వెంకటేశ్వర గ్రూప్స్ వారి.. 3 స్టార్ హోటల్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో వర్చువల్‌గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం
నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీ వెంకటేశ్వర గ్రూప్స్ వారి.. 3 స్టార్ హోటల్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో వర్చువల్‌గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి గణియాతో కలిసి మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీశైలం దేవస్థానానికి తరలి వచ్చే భక్తులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన వసతి కల్పించాలనే ఆలోచనతో ఈ 3 స్టార్ హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. హైదరాబాద్‌లో ప్రముఖ హోటల్ శ్రీ వెంకటేశ్వర గ్రూప్.. శ్రీశైలంలో హోటల్ నిర్మాణంలో భాగస్వాములవడం అభినందనీయమని పేర్కొన్నారు. దాదాపు 1.5 ఎకరాల స్థలంను 33 సంవత్సరాల లీజుకు శ్రీ వెంకటేశ్వర గ్రూప్ కు కేటాయిస్తున్నామని చెప్పారు. రూ. 83 కోట్లు వెచ్చించి దాదాపు 126 రూమ్ లు అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు. కేవలం 18 నెలల కాల పరిమితిలోనే ఈ నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ నిర్మాణంతో దాదాపుగా 300 మందికి ప్రత్యక్షంగా, 1200 మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుంది.