News5th Aug 04:30 PMSunil Byrisetty1 min read

ఆగస్టు 19 నుంచి పీ4 అమలు

పేదరిక నిర్మూలనకు చేపడుతున్న జీరో పావర్టీ-పీ4 లక్ష్యం 2029 నాటికి సాకారం అవుతుందని.. ఇదే మొదటి అడుగు అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో చే

ఆగస్టు 19 నుంచి పీ4 అమలు
పేదరిక నిర్మూలనకు చేపడుతున్న జీరో పావర్టీ-పీ4 లక్ష్యం 2029 నాటికి సాకారం అవుతుందని.. ఇదే మొదటి అడుగు అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో చేపట్టిన పీ4 కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. సచివాలయంలో పీ4పై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 19వ తేదీ నుంచి పీ4 అమలు చేయాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. "పేదరిక నిర్మూలనలో భాగంగానే పీ4 కార్యక్రమాన్ని చేపట్టాం. బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యం. సమాజానికి తిరిగి ఇవ్వాలన్నదే ప్రధాన ఉద్దేశం. మార్గదర్శుల నుంచి చిన్న ఆసరా పేదలకు కొండంత అండ అవుతుంది. ఆ స్పూర్తితోనే అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు పల్లెకుంట హేమలత మార్గదర్శిగా మారి ఓ వృద్ధురాలిని ఆదుకుంటున్నారు. ప్రజలే ఆస్తిగా జీరో పావర్టీ మిషన్ అమలు చేస్తున్నాం." అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Andhra Pradesh
Zero Poverty Mission
P4 Program Chandrababu Naidu P4
AP Poverty Eradication
P4 Initiative 2029
Andhra Pradesh Development
Golden Families Scheme
Social Welfare AP
P4 Launch by CM
పీ4 వీడియో కాన్ఫరెన్స్
సీఎం సంక్షేమ కార్యక్రమాలు
మార్గదర్శులు
Scroll for the next article