News15th Apr 09:21 AMSunil Byrisetty1 min read

ఏపీ మంత్రిమండలి అత్యవ‌స‌ర స‌మావేశం

ఆంధ్రప్రదేశ్ మంత్రివ‌ర్గం మంగళవారం స‌మావేశమవుతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి కావేటి విజ‌యానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద‌యం 11గంట‌ల‌కు అమ‌రావ‌తిలోని వెల‌గ‌పూడి

ఏపీ మంత్రిమండలి అత్యవ‌స‌ర స‌మావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రివ‌ర్గం మంగళవారం స‌మావేశమవుతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి కావేటి విజ‌యానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద‌యం 11గంట‌ల‌కు అమ‌రావ‌తిలోని వెల‌గ‌పూడి స‌చివాల‌య‌లోని 1వ బ్లాక్ స‌మావేశ మందిరంలో మంత్రివ‌ర్గం స‌మావేశం జరుగుతోంది. దీనికి అన్నిశాఖ‌ల స్పెష‌ల్ చీఫ్ కార్యద‌ర్శులు, ప్రిన్సిప‌ల్ కార్యద‌ర్శులు, కార్యద‌ర్శులు త‌మ ప్రతిపాద‌ల‌ను నిర్ణీత న‌మూనాలో పంపించాల‌ని CS కోరారు. P4 ప‌థ‌కంపై మంత్రివ‌ర్గం చ‌ర్చించ‌నుంది. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా, ప్రభుత్వ-ప్రైవేట్-ప్రజల భాగస్వామ్యం (P4) పద్ధతిని అమలు చేసి, జీరో పావర్టీ లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్ర స్థాయి P4 సొసైటీ ఏర్పాటుకు మంత్రి మండ‌లి ఆమోదించ‌నుంది. ఈ సొసైటీని ముఖ్యమంత్రి నాయకత్వంలో ఏర్పాటు చేసి, ఉప ముఖ్యమంత్రిని భాగస్వామ్యం చేస్తున్నారు. పి4 కార్యక్రమంలో 5 లక్ష గోల్డెన్ ఫ్యామిలీ లను ఆగస్టు 15 నాటికి గుర్తించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామ వాలంటీర్ల స‌మ‌స్యపై కూడా మంత్రిమండ‌లి చ‌ర్చించే అవకాశం ఉంది
Andhra Pradesh
News
Chandra babu Naidu
Ap Cabinet
కావేటి విజ‌యానంద్
వెల‌గ‌పూడి సచివాలయం
Scroll for the next article