News22nd Aug 03:52 PMSunil Byrisetty1 min read

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. నిధులు, పెండింగ్ అంశాల పై నిర్మలా సీతారామన్‌తో చర్చించారు. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. నిధులు, పెండింగ్ అంశాల పై నిర్మలా సీతారామన్‌తో చర్చించారు. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ (SASCI) పథకం కింద రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల కోసం అదనంగా రూ. 5,000 కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటివరకు ఈ పథకం కింద రూ. 2,010 కోట్లు లభించాయని ఆయన తెలిపారు. సింగిల్ నోడల్ ఏజెన్సీ ప్రోత్సాహక పథకం కింద రూ. 250 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై త్వరితగతిన ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పూర్వోదయ పథకాన్ని స్వాగతించిన ముఖ్యమంత్రి, దీని విధివిధానాలు త్వరగా రూపొందించి అమల్లోకి తీసుకురావాలని కోరారు.
Andhra Pradesh news
Chandrababu Naidu
Nirmala Sitharaman
SASCI
Capital Investment
AP Funds
Purvodaya
Special Assistance
సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Scroll for the next article