News26th Apr 09:24 AMSunil Byrisetty1 min read
మీతోనే మేము.. ఉగ్రవాదాన్ని అంతమొందిద్దాం!
పాకిస్తాన్ ఉగ్రవాదంపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ అండగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఉగ్రవాదులపై పోరుకు కేంద్రం తీసుకునే నిర్ణయాలకు మద్దతునిస్తున్నామన
పాకిస్తాన్ ఉగ్రవాదంపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ అండగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఉగ్రవాదులపై పోరుకు కేంద్రం తీసుకునే నిర్ణయాలకు మద్దతునిస్తున్నామన్నారు.
పహల్గామ్‌లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు.
న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన చంద్రబాబు తన సంఘీభావాన్ని తెలిపారు.
ఉగ్రవాదులది పిరికిపంద చర్య అని, హింసను ఖండిస్తున్నామని అన్నారు.
దేశ భద్రతను కాపాడే విషయంలో మోదీ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
మే 2న చేపట్టే రాజధాని పనుల పున:ప్రారంభానికి ప్రధాని మోదీని చంద్రబాబు ఆహ్వానించారు.
అమరావతిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానికి వివరించారు.
దీనిపై స్పందించిన ప్రధాని మోదీ.. రాజధాని నిర్మాణానికి సంబంధించి పలు సూచనలు చేశారు.