News15th Jan 02:40 PMSunil Byrisetty1 min read

దొడ్డి గంగమ్మ, నాగాలమ్మకు సీఎం పూజలు

సీఎం చంద్రబాబునాయుడు, కుటుంబ సభ్యులతో కలిసి నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుక

దొడ్డి గంగమ్మ, నాగాలమ్మకు సీఎం పూజలు
సీఎం చంద్రబాబునాయుడు, కుటుంబ సభ్యులతో కలిసి నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా నారావారిపల్లెలోని నివాసంలో టీటీడీ వేద పండితులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. గ్రామదేవత దొడ్డి గంగమ్మ, కులదేవత నాగాలమ్మ దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో తాతయ్య, నాయనమ్మ ఖర్జూరపునాయుడు, అమ్మణమ్మ, బాబాయి నారా రామ్మూర్తినాయుడు సమాధుల వద్ద పూలు ఉంచి మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలోని ఎన్టీఆర్, బసవతారకమ్మ విగ్రహాలకు పూలదండ వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నారా, నందమూరి కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Sankranti Celebrations
Naravaripalle
Nara Lokesh
TTD Vedic Scholars
Special Prayers
Doddi Gangamma
నారా కుటుంబం
నందమూరి కుటుంబం
నివాళులు
ఎన్టీఆర్ విగ్రహం
Scroll for the next article