Education25th Mar 09:09 AMSunil Byrisetty1 min read
బడుల్లో ఆ బెల్ మోగాల్సిందేనన్న చంద్రబాబు
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో తప్పనిసరిగా వాటర్ బెల్ మోగాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఎండలు ముదిరిన నేపథ్యంలో పాఠశాలల్లో తప్పనిసరిగా వాటర్ బెల్ విధానాన్ని అమలు చే
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో తప్పనిసరిగా వాటర్ బెల్ మోగాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
ఎండలు ముదిరిన నేపథ్యంలో పాఠశాలల్లో తప్పనిసరిగా వాటర్ బెల్ విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
సరైన పరిమాణంలో నీరు తాగక డీహైడ్రేషన్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఎండల ఎఫెక్ట్ తగలకుండా చూడాలన్నారు.
అందుకోసం మంచినీటిని నిత్యం అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.
ఉపాధి హామీ కూలీలు ఉ.6 నుంచి 11 గంటల్లోపే పనులు ముగించుకునేలా చూడాలన్నారు.
మున్సిపల్ కార్మికులకు మ.12 నుంచి సా. 4 గంటల్లోపు పనులు అప్పగించొద్దని సూచించారు.
మున్సిపాలిటీల్లో నీటి సమస్య పరిష్కారానికి రూ. 39 కోట్లు విడుదల చేస్తామని పేర్కొన్నారు.