News30th Mar 01:49 PMSunil Byrisetty1 min read
పీ-4 కార్యక్రమం ప్రారంభం
పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే పీ- 4కార్యక్రమం ప్రారంభమైంది. ఉగాది పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెలగపూడి సచివాలయంలో
పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే పీ- 4కార్యక్రమం ప్రారంభమైంది.
ఉగాది పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
20 శాతం మంది నిరుపేదలకు ఉన్నత స్థితిలో ఉన్న 10 శాతం మంది సహాయం చేసేందుకే దీనిని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో దాదాపు 14 వేల మంది పాల్గొంటారు. పేదలు, దాతలు, మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు.
పీ-4 ద్వారా పేదల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా కార్యక్రమం అమలు కానుంది.