News7th Aug 12:51 PMSunil Byrisetty1 min read

జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు

మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. చేనేత ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. రాష్ట్రంలో వివిధ చేనేత క్లస్టర్లలో ఉత్పత్తి అయ

జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు
మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. చేనేత ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. రాష్ట్రంలో వివిధ చేనేత క్లస్టర్లలో ఉత్పత్తి అయిన ప్రొడక్ట్స్‌ను పరిశీలించారు. క్లస్టర్లలో ఎంతమంది డిజైనర్లను నియమించారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. 10 క్లస్టర్లలో 10 మంది డిజైనర్లను నియమించామని అధికారులు వివరించారు. ఈ ఉత్పత్తులకు ఏ మేర డిమాండ్ ఉందని అడగగా.. చేనేత ఉత్పత్తులపై సెలబ్రిటీలు ఎక్కువగా మక్కువ చూపుతున్నారని తెలిపారు. ఒక్క సెలబ్రిటీలకే కాకుండా సామాన్యులకు కూడా చేనేత ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం సూచించారు. చేనేత ఉత్పత్తులన్నింటినీ ఇంటిగ్రేట్ చేసి తనకు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు.
Andhra Pradesh
Chandrababu Naidu
National Handloom Day
Mangalagiri
Handloom Clusters
Handloom Designers
Celebrity Support
Handloom Promotion
Handloom Exhibition
జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు
Scroll for the next article