News12th Jan 01:04 PMSunil Byrisetty1 min read
మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష
సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాలు తదితర అంశాలపై సీఎం సమీక్ష చేపట్టారు. విధ్వంసమైన వ్యవ
సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాలు తదితర అంశాలపై సీఎం సమీక్ష చేపట్టారు. విధ్వంసమైన వ్యవస్థల నుంచి సుపరిపాలనను గాడిలో పెట్టామని చెప్పారు. 2025 ఏడాది మంచి ఫలితాలను ఇచ్చింది. ప్రజల ఆశల్ని నిలబెట్టాం. వారిలో విశ్వాసాన్ని మళ్లీ కల్పించామన్నారు. ఈ ఏడాది కూడా మరింత కష్టించి పనిచేద్దామని పిలుపునిచ్చారు. తల్లికి వందనం ద్వారా రూ.10,090 కోట్లను 67 లక్షల మంది విద్యార్ధుల తల్లుల ఖాతాలకు వేశామని చెప్పారు. స్త్రీశక్తి ద్వారా 3.5 కోట్ల మహిళలు ప్రయాణాలు చేశారని, దీని కోసం ఇప్పటి వరకూ రూ.1114 కోట్లు వ్యయం చేశామని వివరించారు. అన్నదాత సుఖీభవ ద్వారా 46 లక్షల మంది రైతులకు రూ.6,310 కోట్లు జమ చేశామన్నారు. దీపం 2.0 ద్వారా 2 కోట్ల సిలిండర్లను ఇప్పటికి పంపిణీ చేయగలిగాం. దీనికి రూ.2684 కోట్లు వ్యయం చేశామని తెలిపారు. ఏడాదిన్నరలో రూ.50 వేల కోట్ల మేర సామాజిక పెన్షన్లను అందించటంలో సంక్షేమంలో కొత్తమైలు రాయిని సాధించామన్నారు. 70 వరకూ పెద్ద పథకాలు, కార్యక్రమాలు, పనులు చేశామని సీఎం చంద్రబాబు వివరించారు.