News7th Jan 03:29 PMSunil Byrisetty1 min read

పోలవరం వద్ద అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

పోలవరం ప్రాజెక్టు సైట్ వద్ద అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్ధసారధి, నాదెండ్ల మనోహర్, ఇతర ప్రజాప్రతినిధులతో నిర్వ

పోలవరం వద్ద అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
పోలవరం ప్రాజెక్టు సైట్ వద్ద అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్ధసారధి, నాదెండ్ల మనోహర్, ఇతర ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమీక్షకు జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు హాజరయ్యారు. ప్రాజెక్టులో 87 శాతం మేర సివిల్ పనులు పూర్తి అయ్యాయని.. గడువులోగా మిగతా పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. పోలవరం ఎడమ కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం సూచించారు. కుడికాలువ ద్వారా కొల్లేరు ప్రాంతాలకు కూడా నీరు వెళ్లేలా ప్రణాళికలు చేయాలన్న చంద్రబాబు, మే మొదటి వారంలో మళ్లీ పోలవరం ప్రాజెక్టు పనుల్ని తనిఖీ చేస్తానని వెల్లడించారు.
Andhra Pradesh
Polavaram Project
Chandrababu Naidu
CM Review
Water Resources Department
Irrigation Project
పునరావాసం (ఆర్ అండ్ ఆర్)
ఎడమ కాలువ
కుడి కాలువ
కొల్లేరు ప్రాంతం
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి
Scroll for the next article