News26th Aug 01:51 PMSunil Byrisetty1 min read

రైతులకు బ్యాంకులు సహకరించాలి

అమరావతిలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. వ్యవసాయం, ప్రాథమిక రంగాలు, ఎంఎస్ఎంఈ, ఎస్ హెచ్ జీ రంగాలకు రుణ వితరణ లక్ష్యాలు, గ్రామీణ ప్రాంతా

రైతులకు బ్యాంకులు సహకరించాలి
అమరావతిలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. వ్యవసాయం, ప్రాథమిక రంగాలు, ఎంఎస్ఎంఈ, ఎస్ హెచ్ జీ రంగాలకు రుణ వితరణ లక్ష్యాలు, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలపై సమీక్ష నిర్వహించారు. 231 ఎస్ఎల్ బీసీ లో తీసుకున్న నిర్ణయాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టుపై సమీక్ష చేశారు. వన్ ఫ్యామిలీ- వన్ ఎంట్రపెన్యూర్ కార్యక్రమం, 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు అంశంలో బ్యాంకుల సహకారంపై చర్చ చేపట్టారు. ఎస్ఎల్ బీసీ సమావేశాలు రైతులు, ప్రజలు, ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలని కోరారు. ఖరీఫ్ లో ఇప్పటికే సగం సమయం గడిచిపోయింది. ఈ పాటికే రైతులకు రుణాలు, ఇన్ పుట్ ఇవ్వాల్సి ఉందని సీఎం పేర్కొన్నారు. రైతులకు బ్యాంకులు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Amaravati
SLBC Meeting
Farmers Loans
MSME
SHG
Banking Services
Rural Development
Kharif Season
ఖరీఫ్ సీజన్
వ్యవసాయ మద్దతు
వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్
Scroll for the next article