Politics17th Mar 05:19 PMSunil Byrisetty1 min read
త్రిభాష విధానంలో తప్పేముందన్న సీఎం చంద్రబాబు
దక్షిణ భారత రాష్ట్రాల్లో రచ్చరచ్చ లేపుతున్న హిందీ భాష అమలు, త్రిభాష విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ‘‘ఇంగ్లీష్ మీడియంతో నాలెడ్జ్ వస్తుందని చెబుతున్నారు. కానీ భాష కేవలం
దక్షిణ భారత రాష్ట్రాల్లో రచ్చరచ్చ లేపుతున్న హిందీ భాష అమలు, త్రిభాష విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.
‘‘ఇంగ్లీష్ మీడియంతో నాలెడ్జ్ వస్తుందని చెబుతున్నారు. కానీ భాష కేవలం కమ్యునికేషన్‌కు మాత్రమే.
మాతృభాషలో చదువుకున్న వారే ప్రపంచ వ్యాప్తంగా రాణించారు. భాష అనేది ద్వేషించడంలో అర్థం లేదు.
మాతృభాష తెలుగు, హిందీ జాతీయ భాష, అంతర్జాతీయ భాష ఇంగ్లీష్. మన వాళ్లు జపాన్, జర్మనీ, ఇతర దేశాలకు వెళ్తున్నారు.
అవసరమైతే ఆ భాషలను మనం నేర్చుకుంటే ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత ఎక్కువ ఉపయోగం ఉంటుంద’’ని పేర్కొన్నారు. అలాగే ‘‘నాడు 2020 రూపొందించాం. వికసిత్ భారత్ 2047 విజన్ కింద 30 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం కాగా, తలసరి ఆదాయం 18 వేల డాలర్లు పెట్టుకున్నారు. దీనికి అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపొందించుకుని నిర్ధష్టమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలని లక్ష్యం పెట్టుకున్నాం.
వృద్ధిరేటు, తలసరి ఆదాయం తక్కువగా ఉన్న జిల్లాలు ఉన్నాయి. రాయలసీమ రాళ్ల సీమ, ఎడారిగా మారుతుందని గతంలో అందరూ అనుకున్నారు.
కానీ రతనాల సీమగా మారుతోంది. సీమ హార్టికల్చర్ హబ్‌గా మారుతోంది.
రాయలసీమ సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీకి కేంద్రంగా మారుతుంది.
ఒకప్పుడు అనంతపురం కరవు జిల్లా. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు అనంతపురం, మహబూబ్ నగర్ జిల్లాలు సవాల్‌గా ఉండేవి.
కృష్ణానది పక్కనున్న మహబూబ్ నగర్‌కు నీళ్లుండేవి కాదు.
ఆ రెండు జిల్లాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టేవాన్ని.
విజయవాడ, శ్రీకాకుళం, ఆదిలాబాద్ జిల్లాలకు నీళ్లున్నా అభివృద్ధిలేదు. కానీ ఇప్పుడు అనంతపురం జిల్లా 26 జిల్లాల్లో 5వ స్థానంలో ఉంది.
మొదటి స్థానానికి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేద’’ని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.