News24th Sep 10:50 AMSunil Byrisetty1 min read

బ్యాంకర్లూ.. రాజధానికి రండి..

రాజధాని అమరావతికి బ్యాంకర్లు రావాలని సీఎం చంద్రబాబు కోరారు. బ్యాంకులు తమ ప్రాంతీయ కార్యాలయాన్ని అమరావతిలో ప్రారంభించాలన్నారు. రాజధానిలో చేపట్టే వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావ

బ్యాంకర్లూ.. రాజధానికి రండి..
రాజధాని అమరావతికి బ్యాంకర్లు రావాలని సీఎం చంద్రబాబు కోరారు. బ్యాంకులు తమ ప్రాంతీయ కార్యాలయాన్ని అమరావతిలో ప్రారంభించాలన్నారు. రాజధానిలో చేపట్టే వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని పలు బ్యాంకుల ఛైర్మన్‌లు, ఎండీలను కోరారు. లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సమావేశంలో భాగంగా విజయవాడ వచ్చిన పలు బ్యాంకుల ఛైర్మన్‌లు, ఎండీలకు ఈ మేరకు సూచించారు. ఇప్పటికే వివిధ బ్యాంకులకు రాజధానిలో స్థలాలు కేటాయించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. 15 నెలల కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, కేంద్ర సహకారంతో చేపట్టిన ప్రాజెక్టుల గురించి వారికి తెలియజేస్తూ, పోర్టులు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, జాతీయ రహదారులు, క్వాంటం వ్యాలీ తదితర పనుల పురోగతిని వివరించారు.
Andhra Pradesh
Amaravati
Chandrababu Naidu
Capital Development
Banking
Investments
Infrastructure
Vijayawada
AP Capital
Finance
బ్యాంకింగ్ రంగం
పెట్టుబడులు
మౌలిక వసతులు
Scroll for the next article