News1st Sep 05:13 PMSunil Byrisetty1 min read
వెలిగొండ నీటిపై సీఎం చంద్రబాబు ట్వీట్
వెలిగొండ నీటి విడుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. నీరు అందుబాటులోకి రావడంతో మనుషులతో పాటు మూగజీవాలకు సైతం తాగునీటి అవసరాలు తీరుతున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్
వెలిగొండ నీటి విడుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. నీరు అందుబాటులోకి రావడంతో మనుషులతో పాటు మూగజీవాలకు సైతం తాగునీటి అవసరాలు తీరుతున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఆసక్తికరమైన పోస్టు చేశారు. “జలంతోనే.. జీవం, జీవితం” అంటూ ట్వీట్ చేశారు. వెలిగొండ ఫీడర్ కెనాల్‌లో వానరాలు దాహార్తిని తీర్చుకుంటున్న దృశ్యాలను పంచుకున్నారు. నీటి ప్రవాహం వద్దకు చేరుకున్న వానరాలు నీటిని తాగుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. గతంలో నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రాంతాల్లో ఇప్పుడు వెలిగొండ జలాలు అందుబాటులోకి రావడం సంతోషకరమైన పరిణామమని సీఎం పేర్కొన్నారు. కరవు ప్రాంతాల్లో నీరు అందుబాటులోకి రావడం వల్ల పంటలకు మాత్రమే కాకుండా పశుపక్ష్యాదులు, వన్యప్రాణులకు కూడా ప్రయోజనం కలుగుతోందన్నారు.