News15th Sep 12:29 PMSunil Byrisetty1 min read

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు తిరుమలలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భ

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు తిరుమలలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి... సాయంత్రం 5.30 గంటలకు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాల మైదానంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరి సాయంత్రం 6.20 గంటలకు శ్రీ గాయత్రీ నిలయానికి చేరుకుంటారు. రాత్రి 7.40 గంటలకు బేడి ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. అనంతరం రాత్రి 7.55 గంటల నుంచి 9.15 గంటల వరకు వేంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించి, స్వామి వారిని దర్శించుకుంటారు. దర్శనం అనంతరం గాయత్రీ నిలయానికి చేరుకుని రాత్రి బస చేస్తారు. బుధవారం ఉదయం 8.40 గంటలకు వీఐపీ క్యూ కాంప్లెక్స్‌-1లోని 17వ కంపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన యాత్రికుల అనుభవ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. 9.15 గంటలకు గోగర్భం డ్యామ్‌ సర్కిల్‌ వద్ద ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రారంభిస్తారు. 9.35 గంటలకు ఎస్వీ మ్యూజియాన్ని ప్రారంభిస్తారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Tirumala
Srivari Brahmotsavams
Salakatla Brahmotsavams
Lord Venkateswara
Tirupati
టీటీడీ
విద్యుత్ బస్సులు
ఎస్వీ మ్యూజియం
యాత్రికుల అనుభవ కేంద్రం
ఆంధ్రప్రదేశ్ సీఎం
తిరుమల వార్తలు
Scroll for the next article