News31st May 08:36 AMSunil Byrisetty1 min read

కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం, కాట్రేనికోన మండలం, చెయ్యేరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొనున్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను సొమ్మును నేరుగా అందిస్తా

కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం, కాట్రేనికోన మండలం, చెయ్యేరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొనున్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను సొమ్మును నేరుగా అందిస్తారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొంటారు. 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లను ప్రభుత్వం అందిస్తోంది. జూన్ నెల పింఛన్‌కు గాను ప్రభుత్వం ఇప్పటికే 63 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,717.90 కోట్లను విడుదల చేసింది. సాధారణంగా ఇంట్లో పింఛను తీసుకుంటున్న వ్యక్తి చనిపోయాక భార్యకు వితంతు పింఛను తీసుకోవాలంటే కొత్తగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అలా వారు ఒకట్రెండు నెలలు పింఛను కోల్పోయే అవకాశం ఉంది. ఈ ఇబ్బందులు తలెత్తకుండా కూటమి ప్రభుత్వం స్పౌజ్ పింఛన్ల విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానంలో భాగంగా 71 వేల మంది స్పౌజ్ పింఛన్లు అందుకోనున్నారు. గత ప్రభుత్వంలో ఒక నెల పింఛను తీసుకోకపోతే రెండో నెల పింఛను ఇచ్చేవారు కాదు. కూటమి ప్రభుత్వం వచ్చాక మూడు నెలల పింఛను ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పించింది.
Andhra Pradesh news
cmchandrababu
tdp
konaseemadistrict
pension distribution
కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు
ముమ్మిడివరం నియోజకవర్గం
Scroll for the next article