News23rd Aug 05:10 PMSunil Byrisetty1 min read
కీలక నేతలతో సీఎం చంద్రబాబు భేటీ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు కీలక నేతలతో సమావేశం కానున్నారు. ఈ భేటీకి మంత్రులు, పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. అసెంబ్లీ, పార్లమ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు కీలక నేతలతో సమావేశం కానున్నారు. ఈ భేటీకి మంత్రులు, పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. అసెంబ్లీ, పార్లమెంటరీ కమిటీల నియామకాలతో పాటు రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. స్త్రీశక్తి పథకం విజయవంతం నేపథ్యంలో జిల్లాల్లో నిర్వహించనున్న సమావేశాలపై కూడా చర్చ జరగనుంది. సెప్టెంబర్ 3న అనంతపురంలో "సూపర్ సిక్స్.. సూపర్ హిట్" పేరుతో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. అలాగే, వరుస వివాదాల్లో చిక్కుకున్న ఎమ్మెల్యేల వ్యవహారాలపై ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు చర్చించనున్నట్లు సమాచారం.