News12th Sep 10:40 AMSunil Byrisetty1 min read

15,16 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్

ఈనెల 15, 16 తేదీల్లో సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులో రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు. గత కొద్ది రోజులు

15,16 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్
ఈనెల 15, 16 తేదీల్లో సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులో రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పలు వురు ఐఏఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఐపీఎస్ లు బదిలీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గురువారం 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించటంతో పాటు కొత్త టీంతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. కలెక్టర్ల సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధికి సంబంధించి ఇప్పటికే విజన్ డాక్యుమెంట్లకు రూపకల్పన జరిగింది. ఏడాదిన్నర పాలన విధివిధానాల అమలు తీరుపై సీఎం సమీక్షించనున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ఈసారి కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించే ఈ సదస్సులో వచ్చే మూడేళ్లలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలులో వస్తున్న ఫిర్యాదులను క్రోఢీకరించి నూరు శాతం సంతృప్తి స్థాయికి చేరే లక్ష్యాలను నిర్దేశించనున్నట్లు తెలిసింది.
Andhra Pradesh
Chandrababu Naidu
Collectors Conference
IAS
IPS
IFS
Vision Document
Secretariat
కలెక్టర్ల కాన్ఫరెన్స్
అభివృద్ధి కార్యక్రమాలు
కలెక్టర్ల సదస్సు
Scroll for the next article