News23rd Dec 02:17 PMSunil Byrisetty1 min read
అయోధ్య సందర్శనకు చంద్రబాబు!
సీఎం చంద్రబాబు డిసెంబర్ 28న అయోధ్య పర్యటనకు వెళ్లనున్నారు. చంద్రబాబు డిసెంబర్ 28న ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో అయోధ్యకు బయలుదేరుతారు. అక్కడ రామజన్మభూమి ఆలయాన్ని దర్శించుక
సీఎం చంద్రబాబు డిసెంబర్ 28న అయోధ్య పర్యటనకు వెళ్లనున్నారు. చంద్రబాబు డిసెంబర్ 28న ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో అయోధ్యకు బయలుదేరుతారు. అక్కడ రామజన్మభూమి ఆలయాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రానికి తిరిగి విజయవాడ చేరుకుంటారు.
ఇది ప్రధానంగా ఒక ఆధ్యాత్మిక పర్యటన. ఇటీవల అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు, ధ్వజారోహణ వంటి కీలక ఘట్టాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆయన బాలరాముడిని దర్శించుకోనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాజధాని అమరావతి నిర్మాణం సజావుగా సాగాలని కోరుకుంటూ ఆయన ఈ మొక్కు తీర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.