News17th Nov 04:00 PMSunil Byrisetty1 min read

19న కడప జిల్లాకు సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు ఈనెల 19న కడప జిల్లాకు వస్తారని సమాచారం. కమలాపురం నియోజకవర్గ పరిధిలోని పెండ్లిమర్రి మండలంలో ఆయన రైతులతో సమావేశమవుతారు. పీఎం కిసాన్ నిధుల విడుదల తర్వాత క్షేత్రస్థాయిలో

19న కడప జిల్లాకు సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు ఈనెల 19న కడప జిల్లాకు వస్తారని సమాచారం. కమలాపురం నియోజకవర్గ పరిధిలోని పెండ్లిమర్రి మండలంలో ఆయన రైతులతో సమావేశమవుతారు. పీఎం కిసాన్ నిధుల విడుదల తర్వాత క్షేత్రస్థాయిలో పొలాలను పరిశీలిస్తారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నేడు లేదా రేపు అధికారికంగా షెడ్యూల్ రానుంది. అలాగే అక్కడి నుంచే అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు విడుదల చేయనున్నారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Kadapa District
Kamalapuram Constituency
Pendlimarri Mandal
Farmers Meeting
PM Kisan Funds
వ్యవసాయ శాఖ
సీఎం పర్యటన షెడ్యూల్
19న కడప జిల్లాకు చంద్రబాబు
Scroll for the next article