News23rd Dec 03:35 PMSunil Byrisetty1 min read
అసెంబ్లీ సెక్రటేరియట్ క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించిన సీఎం
అసెంబ్లీ సెక్రటేరియట్ రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సమక్షంలో ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో 202
అసెంబ్లీ సెక్రటేరియట్ రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సమక్షంలో ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో 2026 క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. జీవ వైవిద్యం-ఆంధ్రప్రదేశ్ సజీవ వారసత్వం అనే థీమ్‌తో క్యాలెండర్ అసెంబ్లీ సెక్రటేరియట్ రూపొందించింది. ఏపీలోని ప్రకృతి సంపద, కళలు, సంప్రదాయాలు, ఆధునిక సాంకేతికతలకు అద్దం పట్టేలా కొత్త సంవత్సరం క్యాలెండర్ సిద్ధం చేశారు. ఏపీలో ఉన్న వివిధ వన్యప్రాణుల గురించి అవగాహన కల్పించేలా, సాంప్రదాయ కలంకారీ కళాశైలిలో క్యాలెండర్లోని చిత్రాలు వచ్చేలా డిజైన్ చేయించారు. 2026 సంవత్సరానికి చెందిన క్యాలెండర్ ను చక్కగా డిజైన్ చేశారన్న సీఎం చంద్రబాబు ప్రశంసించారు.